రోహిత్ అవుట్

రోహిత్ అవుట్

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మొదటి వికెట్ ను కోల్పోయింది. 231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఓపెనర్ రోహిత్ శర్మ (9) వికెట్ ను చేజార్చుకుంది. ఆరో ఓవర్ చివరి బంతికి ఆసీస్ పేసర్ సిడిల్ రోహిత్ ను క్యాచ్ అవుట్ గా వెనక్కి పంపాడు. ప్రస్తుతం టీమిండియా 9 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. క్రీజ్ లో శిఖర్ ధావన్ (12), కెప్టెన్ విరాట్ కోహ్లీ (4)లు ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 206 పరుగులు చేయాలి.