టీ బ్రేక్.. ఆసీస్ స్కోర్ 145/7

టీ బ్రేక్.. ఆసీస్ స్కోర్ 145/7

మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భారత బౌలర్లు చెలరేగారు. మూడో రోజు భారత బౌలింగ్‌ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లు తక్కువ పరుగులకే పెవిలియన్ కు క్యూ కట్టారు. టీ బ్రేక్ సమయానికి ఆసీస్‌ 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. దీంతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ పరుగులకు ఆసీస్ ఇంకా 298 పరుగులు వెనుకబడి ఉంది. మూడో సెషన్ లో కూడా భారత బౌలర్లు రాణిస్తే ఆసీస్ ను ఫాలో ఆన్ ఆడించొచ్చు. 8/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌కి దిగిన ఆసీస్ మూడో రోజు ఆదిలోనే మూడు కీలక వికెట్లు  కోల్పోయింది. అనంతరం వరుస విరామాల్లో మరో 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో బుమ్రా 3.. జడేజా 2 వికెట్లు తీశారు. ప్రస్తుతం క్రీజ్ లో పైన్‌ (22), స్టార్క్ (5)లు ఉన్నారు.