హమ్మయ్య.. కమిన్స్ అవుట్

హమ్మయ్య.. కమిన్స్ అవుట్

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా విజయం అంచున నిలిచింది. నిన్నటి నుండి భారత బౌలర్లను ఓ ఆటాడుకున్న ఆసీస్ పేస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ ఎట్టకేకలకు అవుట్ అయ్యాడు. అద్భుత బంతితో బుమ్రా.. కమ్మిన్స్ (63)ను అవుట్ చేసాడు. కమ్మిన్స్ చివరి రోజు 2 పరుగులు చేసి అవుట్ య్యాడు. ఉదయం వర్షం కారణంగా మొదటి సెషన్ లో ఒక్క బంతి కూడా పడలేదు. లంచ్ అనంతరం ఆట మొదలైన నాలుగవ ఓవర్లోనే బుమ్రా.. కమ్మిన్స్ ను పెవిలియన్ పంపాడు.