లంచ్ బ్రేక్.. కోలుకున్న భారత్

లంచ్ బ్రేక్.. కోలుకున్న భారత్

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఓపెనర్ లోకేష్ రాహుల్ (9) వికెట్ ను కోల్పోయింది. 10 పరుగులకే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను మరో ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ ఆదుకున్నాడు. అగర్వాల్‌ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. అతనికి పుజారా చక్కటి సహకారం అందిచాడు. ఈ జోడి ఇప్పటికే 59 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పింది. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్‌ కొలుకుంది. భారత్‌ 24 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్‌ నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజ్ లో అగర్వాల్‌ (42; 79 బంతుల్లో 5×4), పుజారా (16; 59 బంతుల్లో 1×4)లు ఉన్నారు.