మయాంక్ అర్ధసెంచరీ.. స్కోర్ 119/1

మయాంక్ అర్ధసెంచరీ.. స్కోర్ 119/1

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ అర్ధసెంచరీ చేసాడు. మయాంక్ అగర్వాల్‌ 95 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుబెబ్బ తగిలింది. ఓపెనర్‌ రాహుల్‌ (9) త్వరాగానే పెవిలియన్ చేరాడు. హేజిల్‌వుడ్‌ వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికే రాహుల్‌ మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు. 10 పరుగులకే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను అగర్వాల్‌ అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. అర్ధ సెంచరీ చేసిన అనంతరం దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. మరోవైపు పుజారా ఆచితూచి ఆడుతూ.. చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఈ జోడి ఇప్పటికే 109 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పింది. టీమిండియా 33 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్‌ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజ్ లో అగర్వాల్‌ (71), పుజారా (32)లు ఉన్నారు.