రాహుల్ అవుట్.. స్కోర్ 65/1

రాహుల్ అవుట్.. స్కోర్ 65/1

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌ ఎల్‌ రాహుల్‌ (9) త్వరాగానే పెవిలియన్ చేరాడు. హేజిల్‌వుడ్‌ వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికే కేఎల్‌ రాహుల్‌ మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో రాహుల్ తన చెత్త ఫామ్ ను అలాగే కొనసాగించి నిరాశపరిచాడు. మరో ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ (40; 75బంతుల్లో 5×4) మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. అతనికి పుజారా(12) చక్కటి సహకారం అందిస్తున్నాడు. టీమిండియా 23 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్‌ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజ్ లో అగర్వాల్‌ (40), పుజారా (14)లు ఉన్నారు.