విండీస్ టార్గెట్ః 289

విండీస్ టార్గెట్ః 289

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా 288 పరుగులకు అలౌటైంది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 79 పరుగుల వద్దే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. స్టీవ్ స్మిత్ (73; 103బంతుల్లో 7ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. అతనికి తోడుగా కౌంటర్ నైల్ (92; 60బంతుల్లో 8 ఫోర్లు, 4సిక్స్‌లు) వీరవిహారం చేశారు. ఇద్దరు కలిసి కష్టాల్లో ఉన్న జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. విండీస్ బౌలర్లు విజృంభిస్తున్నా స్మిత్, నైల్ జోడీ దీటుగా ఎదుర్కొన్నారు. ప్రపంచకప్‌ చరిత్రలో 8వ స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన ఆటగాళ్లు చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం మరో విశేషం. విండీస్‌ బౌలర్లలో బ్రాత్‌వైట్‌ మూడు వికెట్లు, థామస్‌, షెల్డన్‌, రసెల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.