టాస్ ఓడినా బ్యాటింగ్ మనదే.. జట్టులో మార్పులు ఇవే..!

టాస్ ఓడినా బ్యాటింగ్ మనదే.. జట్టులో మార్పులు ఇవే..!

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్న భారత జట్టు.. రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ దిగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్... టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. అయితే, పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని... జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నట్టు ఆసీస్ కెప్టెన్ ఫించ్ వెల్లడించాడు. ఇక, భారత జట్టులో కొన్ని మార్పులు చేశారు.. రిష‌బ్ పంత్ గాయపడడంతో అతడి స్థానంలో మ‌నీష్ పాండే ఆడనున్నట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. మరోవైపు శార్దూల్ థాకూర్ స్థానంలో న‌వ‌దీప్ సైనీని బరిలోకి దిగగా.. రాజ్‌కోట్ వ‌న్డేకు బ్యాక‌ప్ వికెట్ కీప‌ర్‌గా ఆంధ్ర వికెట్ కీప‌ర్ కేఎస్ భ‌ర‌త్ పేరును సెల‌క్షన్ క‌మిటీ ప్రకటించింది. అయితే, తాము టాస్ గెలిస్తే మాత్రం ముందుగా ఫీల్డింగ్ తీసుకునే వారిమని విరాట్ కోహ్లీ తెలిపారు.