పాక్‌పై ఆసీస్‌ ఘన విజయం

పాక్‌పై ఆసీస్‌ ఘన విజయం

వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓ విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన ముక్కోణపు టీ-20లో ఆస్ర్టేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ పేసర్‌ బిల్లీ స్టాన్‌లేక్‌ (4/8) రికార్డుస్థాయి ప్రదర్శనకి తోడు ఆండ్రు టై(3/38) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ జట్టు 19.5 ఓవర్లలో 116  పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ టాప్ 5 బ్యాట్స్ మెన్స్ చేసిన పరుగులు 33. చివరలో అలీ(22), ఖాన్(29), అష్రాఫ్(21)లు ఆదుకోవడంతో పాక్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.

అనంతరం ఆసీస్‌ కేవలం 10.5 ఓవర్లలోనే ఒక వికెట్‌ నష్టానికి 117 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్‌(33 బంతుల్లో 68 నాటౌట్‌) మెరుపు అర్ధ సెంచరీ చేశాడు. తన కోట నాలుగు ఓవర్లలో 4–0–8–4తో పాక్ ను హడలెత్తించిన స్టాన్‌లేక్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది. ఈ మ్యాచ్‌ ద్వారా పాకిస్థాన్ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ 100 అంతర్జాతీయ టీ-20లు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.