సైకిల్ దొంగగా మారిన ఐపీఎల్ క్రికెటర్...

సైకిల్ దొంగగా మారిన ఐపీఎల్ క్రికెటర్...

చెడు వ్యసనాలను అలవరుచుకోవడం సులభం... కానీ వదిలించుకోవడమే కష్టం. అయితే ఈ వ్యసనాల వలన మనిషి ఎంతకైనా దిగజారిపోతాడు. అటువంటి పనే చేసాడు ఓ ఐపీఎల్ క్రికెటర్. మద్యం కు డబ్బులు లేకపోవడంతో ఓ సైకిల్ దొంగతనం చేసి పోలీసులకు దొరికి పోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్‌ పోమర్స్‌బ్యాక్‌ అనే క్రికెటర్ 2014 ముందు వరకు ఆర్సీబీ తరుపున ఆడాడు. తరువాత ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడిని ఐపీఎల్ నుండి తొలగించారు అధికారులు. అయితే తరువాత ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ లో ఓ జట్టుకు కెప్టెన్ గా ఉండి కప్పు సాధించి పెట్టాడు. అయితే తరువాత వ్యసనాలు ఎక్కువ కావడం తో మొత్తం క్రికెట్ కి దూరం అయ్యాడు. అయితే పోమర్స్‌ మీద ఇదివరకే ఓ మద్యం బట్టిల్, అలాగే బైక్ దొంగతనం చేసిన కేసులు కూడా ఉన్నాయి. అయితే పోమర్స్‌ అలవాట్ల కారణంగా అతని కుంటుంబం కూడా అతడిని వదిలేసింది. అయితే క్రికెట్ వేలం లో కోట్లు పలికి ఓ క్రికెటర్ చెడు వ్యసనాల కారణంగా చిల్లర దొంగగా మారాడు.