మూడో రౌండ్‌కు ఫెడరర్‌, షరపోవా

మూడో రౌండ్‌కు ఫెడరర్‌, షరపోవా

ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్విస్ స్టార్ రోజర్‌ ఫెడరర్‌, స్పెయిన్‌ బుల్ రాఫెల్‌ నాదల్‌లు దూసుకుపోతున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఫెడరర్‌, నాదల్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ఫెడరర్‌ 7–6 (7/5), 7–6 (7/3), 6–3తో డానియెల్‌ ఎవాన్స్‌ (ఇంగ్లండ్‌)పై.. నాదల్‌ 6–3, 6–2, 6–2తో మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొందారు. సిలిచ్‌ (క్రొయేషియా)  7–5, 6–7 (9/11), 6–4, 6–4తో మెక్‌డోనాల్డ్‌ (అమెరికా)పై.. థామస్‌ ఫెబియానో (ఇటలీ) 6–7 (15/17), 6–2, 6–4, 3–6, 7–6, (10/5)తో ఒపెల్కాపై (అమెరికా)పై విజయం సాధించారు.

మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో పల్యుచెంకోవా (రష్యా ) 6–3, 3–6, 3–6తో బెర్టెన్స్‌ (నెదర్లాండ్స్‌) గెలుపొందింది. కెర్బర్‌ 6–2, 6–3తో బియట్రిజ్‌ మైయా (బ్రెజిల్‌)పై.. స్టీఫెన్స్‌ 6–3, 6–1తో టిమియా బబొస్‌ (హంగేరి)పై.. వోజ్నియాకి 6–1, 6–3తో లార్సన్‌ (స్వీడెన్‌)పై.. క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–1, 6–3తో కెమెలియా బెగు (రుమేనియా)పై.. షరపోవా (రష్యా) 6–2, 6–1తో రెబెక్కా పీటర్సన్‌ (స్వీడెన్‌)పై గెలుపొందారు.