ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌: ఫెడరర్‌కు షాక్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌: ఫెడరర్‌కు షాక్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆదివారం సంచలనం నమోదయింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గ్రీస్‌ యువతార స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ (20) చేతిలో ఫెడరర్‌ ఓటమిని ఎదుర్కొన్నాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిట్సిపాస్‌ 6–7  (11/13), 7–6 (7/3), 7–5, 7–6 (7/5)తో ఫెడరర్‌పై గెలిచి కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో.. సిట్సిపాస్‌ మొదటి సెట్ నుంచి స్విస్ దిగ్గజంకు గట్టి పోటీ ఇచ్చాడు. 20 ఏస్‌లు సంధించిన సిట్సిపాస్‌ కేవలం ఒక డబుల్‌ ఫాల్ట్‌ మాత్రమే చేశాడు. మరోవైపు ఫెడరర్‌ 12 ఏస్‌లు కొట్టినా లాభంలేకపోయింది.

మ్యాచ్ అనంతరం సిట్సిపాస్‌ మాట్లాడుతూ... ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఎక్కువ ఆనందంలో ఉన్నది నేనే. నాకు ఆరేళ్ల వయసు నుండి ఫెడరర్‌ను ఆరాధిస్తున్నాను. రాడ్‌ లేవర్‌ పేరిట ఉన్న సెంటర్‌ కోర్టులోనే ఫెడరర్‌తో ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైంది. ఈ విజయాన్ని ఎలా చెప్పాలో మాటలు రావడంలేదని చెప్పుకొచ్చారు.