ఫెద‌ర‌ర్‌తో 'విరుష్క' జంట

ఫెద‌ర‌ర్‌తో 'విరుష్క' జంట

ఆస్ట్రేలియాలో టీమిండియా చరిత్ర సృష్టించింది. మొదటగా టీ-20 సిరీస్‌ను డ్రా చేసుకున్న టీమిండియా.. టెస్ట్, వన్డే సిరీస్‌లను సాధించింది. దీంతో కంగారుల గడ్డపై కొత్త అధ్యయాన్ని లిఖించింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌ కూడా గెలవని టీమిండియా.. ఆ లోటును కూడా తీర్చేసుకుంది. శుక్రవారం మెల్బోర్న్ వేదికగా ముగిసిన మూడో వన్డే అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ సంబరాల్లో మునిగిపోయారు.

ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ త‌న సతీమణి అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌ల‌ను చూడ‌డానికి వెళ్లాడు. సెరీనా, జకోవిచ్ మ్యాచ్‌ల‌ను ఈ జంట వీక్షించారు. అనంతరం విరుష్క జంట టెన్నిస్  దిగ్గ‌జం రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌ను కలిశారు. ఫెద‌ర‌ర్‌తో కలిసి దిగిన ఫోటోను, వారు మ్యాచ్ వీక్షించిన పోటోలను కోహ్లీ త‌న ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు. 'ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అద్భుత‌మైన రోజు. ఆస్ట్రేలియా వేస‌వికి మంచి ముగింపు ప‌లికాం. ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాం' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.