స్మిత్, వార్నర్‌ రీ ఎంట్రీ.. వరల్డ్‌ కప్‌ ఆసీస్‌ జట్టు ఇదే..

స్మిత్, వార్నర్‌ రీ ఎంట్రీ.. వరల్డ్‌ కప్‌ ఆసీస్‌ జట్టు ఇదే..

క్రికెట్ ప్రపంచకప్‌లో తలపడనున్న తమ జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. గతంలో నిషేధానికి గురైన స్టార్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌కు ఏడాది నిషేధం తర్వాత తిరిగి ఆసీస్‌ జట్టులో చోటు దక్కింది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ కోసం ఇవాళ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. బాల్‌ ట్యాంపరింగ్ వివాధంతో 2018లో నిషేధానికి గురైన స్మిత్, వార్నర్‌లకు చోటు కల్పించారు. నిషేధం తర్వాత ఇప్పటి వరకు వీరిద్దరూ ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ వారి సామర్థ్యంపై నమ్మకముంచిన ఆసీస్ మేనేజ్‌మెంట్ మెగా టోర్నీకి ఎంపిక చేసింది. మొత్తం 15 మంది ఆటగాళ్ల జాబితాను ఆసీస్ ఇవాళ ప్రకటించింది. 

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టు:
అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, అలెక్స్ కేరీ, మార్కస్ స్టాయినీస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, జే రిచర్డ్‌సన్, పాట్ కమిన్స్, బెహ్న్రెండార్ఫ్, నాథన్ కౌల్టర్ నైల్, ఆడం జంపా, నాథన్ లైయన్.. ఇలా 15 మంది పేర్లను ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా.