హైదరాబాద్ పహాడీషరీఫ్ లో దారుణం

హైదరాబాద్ పహాడీషరీఫ్ లో దారుణం

హైదరాబాద్ నగరశివారులోని పహాడీషరీఫ్ లో దారుణం చోటుచేసుకుంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ యువకుడిని కొంత మంది పోకిరీలు కిరాతకంగా హత్య చేశారు. ఆటో కిరాయి ఏడువందల కోసం ప్రాణాలు తీశారు దుర్మార్గులు. ఆటో డ్రైవర్ ను చంపి పెట్రోలు పోసి తగలబెట్టారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు పాల్పడ్డ ఆరుగురు పోకిరీలను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.