అంబులెన్స్ ను ఢీకొన్న ఆటో

అంబులెన్స్ ను ఢీకొన్న ఆటో

ఓ ఆటో డ్రైవర్ అతివేగం.. అజాగ్రత్తతో నడపడటంతో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్ గోపాలపురం ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న ఆటో స్టాండ్ లోని ఓ ఆటో పరిమితికి మించి ప్రయాణీకులతో బయలుదేరింది. అతివేగంతో రాంగ్ రూట్లో వెళ్తున్న ఆటో ఆర్మీకి చెందిన అంబులెన్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో తుక్కుతుక్కైంది. అందులోని ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడటంతో.. స్థానికులు వారందర్నీ ఆటో నుంచి బయటకు తీశారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ  ఆసుపత్రికి తరలించారు.

మద్యం మత్తులో ఆటో నడిపి ఉంటాడేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రయాణీకులు. లైసెన్సు కూడా లేకపోవచ్చని వారు అంటున్నారు. పట్టించుకోవాల్సిన ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో.. ప్రమాదాలకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాను సేకరించి.. కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.