షాకింగ్ వీడియో: హైదరాబాద్ రోడ్లలో ఆటో టెర్రర్

షాకింగ్ వీడియో: హైదరాబాద్ రోడ్లలో ఆటో టెర్రర్

విశ్వనగరం హైదరాబాద్‌లో వాహనం నడిపే వారందరికి ముందో వెనకో పక్కనో ఆటో ఉందంటే హడల్. ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్తుందో తలలు బద్దలు కొట్టుకున్నా తెలియని టెర్రర్. అసలే పద్మవ్యూహం వంటి ట్రాఫిక్. అందులో ఆటోవాలాల దురుసు డ్రైవింగ్‌తో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎందరో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల పాలవడం సర్వసాధారణం. ఇటువంటి ఘటన ఒకటి కెమెరా కంటికి చిక్కింది. తనే ముందు దూసుకెళ్లాలన్న ఆత్రుతలో ఓ ఆటోవాలా వెనక వస్తున్న బైక్‌కి దారి ఇవ్వలేదు. ఆటోని ఓవర్ టేక్ చేయబోయిన బైకర్‌ని పక్కకి నెడుతూ చివరికి అతను డివైడర్ తగిలి కింద పడేందుక కారకుడయ్యాడు ఆ ఆటోడ్రైవర్. జరిగిన తప్పు గుర్తించగానే బండి వేగం పెంచి తప్పించుకోబోయాడు. ఎదురుగా కనిపించిన మలుపులోకి ఆటో మళ్లించి కన్నుగప్ప బోయాడు. కానీ కర్మ. ఆ మలుపు దగ్గర ఆటో బోల్తాకొట్టి దొరికిపోయాడు. ఆ వీడియోని మీరూ ఓ సారి చూడండి.