125 స్థానాలు మావే.. జగనే సీఎం..!

125 స్థానాలు మావే.. జగనే సీఎం..!

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్... ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన... అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ర్టంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. 125 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందన్న ఆయన... వైఎస్ జగన్ జగన్‌ మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.