'జగన్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..'

'జగన్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..'

'నాపై సీఎం జగన్ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. రాబోయే రోజుల్లో టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం. అతిథి దేవో భవ నినాదంతో ముందుకెళ్తాం' అని అన్నారు ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్‌. సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రిగా ఇవాళ ఆయన బాధ్యతలు స్వీకరించారు. టూరిజం కార్పొరేషన్ తరహాలో ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న ఫైల్‌పై అవంతి తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ '13 జిల్లాల్లోని టూరిజం స్పాట్లను అభివృద్ధి చేస్తాం. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులిస్తాం. ఏపీ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్‌ని నియమిస్తాం. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తాం' అని చెప్పారు. రాష్టానికి వచ్చే ప్రతి టూరిస్టూ.. దేవుడితో సమానమని మంత్రి అభిప్రాయపడ్డారు.