పవన్ పై అవంతి సంచలన వ్యాఖ్యలు

పవన్ పై అవంతి సంచలన వ్యాఖ్యలు

విశాఖ లాంగ్ మార్చ్ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శల పైన వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. విశాఖ సభలో వైసీపీ నేతలను తాట తీస్తామంటూ సినిమా డైలాగుతో పవన్ హెచ్చరించారని..మాకు తాయ తీయటం రాదా అని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి విమర్శలు చేయొద్దని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు బెదిరింపులకు దిగితే రాష్ట్రంలో పవన్ తిరగలేరనే విషయం గుర్తుంచుకోవాలని అవంతి హెచ్చరించారు. కాపులు అంటే పవన్ మాత్రమేనా మరెవరూ లేరా  కాపుల్లో మీరు తప్పితే మరెవరూ పైకి రాకూడదా అని పవన్ ను ప్రశ్నించారు.

రెండుచోట్ల ఎందుకు ఓడిపోయారో ముందు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. అమ్ముడపోయా వంటూ అందరూ చెప్పుకుంటున్నారని అవంతి పేర్కొన్నారు.  విశాఖలో అయ్యన్న..అచ్చెన్న లేకుండా పవన్ ప్రశ్నించలేరా అని విమర్శించారు. రెండు కిలో మీటర్లు నడవలేకపోయిన మీరు..పోలీసులను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. దేశంలో ఎంతో మంది పైన రాజకీయంగా వేధింపుల్లో భాగంగా కేసులు పెట్టారని అందులో భాగంగా జగన్ మీద కేసులు పెట్టారని అవంతి వివరించారు. ఎవరినైనా వాడుకొని వదిలేసే నైజం చంద్రబాబుదని అవంతి మండిపడ్డారు. చంద్రబాబు అజెండాను పవన్ మోస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆయనకి సినిమాకు నిజజీవితానికి తేడా తెలియడం లేదని మండిపడ్డారు.