శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జగన్ ప్రభజనం !

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జగన్ ప్రభజనం !

పంచాయితీ ఎన్నికల్లో గెలిసిన అభ్యర్థులను అభినందించిన మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ ఎన్నికల్లో వైస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిందన్న ఆయన సుమారు 10 వేలకు పైగా వైస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాదించారని అన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభజనం కొనసాగిందని ఆయన అనారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు వలన ఏకపక్షంగా ప్రజలు తీర్పునిచ్చారని అవంతి పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో వైస్సార్సీపీ హావా కొనసాగిందని భీమిలి మండలంలో 15 పంచాయతీలకు 15  వైస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. పద్మనాభం మండలలో 95 శాతం ఆనందపురం మండలంలో 90 శాతం విజయం సాధించారని, టీడీపీకి ఎన్నికల్లో అభ్యర్థులే దోరకలేదని అన్నారు. బలవంతంగా చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయించారన్న అవంతి చంద్రబాబు తన స్థాయి దిగజార్చుకొని విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో వైస్సార్సీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని అన్నారు చంద్రబాబు ఇంకా బ్రమల్లో బతుకుతున్నారన్న ఆయన ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు.