అవ‌తార్‌ను అధిగమించిన అవెంజర్స్

అవ‌తార్‌ను అధిగమించిన అవెంజర్స్

అవతార్.. మొన్నటి వరకు ప్రపంచంలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డుల్లో ఉండేది.  ఈ చిత్రం మొత్తంగా 2.7897 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండేది.  ఈ చిత్రాన్ని మరెవరూ బ్రేక్ చేయలేరని చాలాసార్లు అవతార్ మేకర్స్ అన్నారు.  దీన్నొక పోటీగా తీసుకున్న ఆవెంజెర్స్ టీమ్ అవ‌తార్‌ను అదిగమించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.  మొదటిసారి విడుదలతో అంత మొత్తాన్ని దాటలేకపోయినా రెండోసారి విడుదలతో దాన్ని బీట్ చేసే స్థాయికి చేరుకున్నారు. 

రెండవసారి 'అవెంజర్స్: ఎండ్ గేమ్'ను విడుదలచేసేటప్పుడు కొత్తగా చాలా సన్నివేశాలను కలిపారు.  దీంతో ప్రేక్షకాదరణ దక్కించుకుని ప్రస్తుతానికి 2.7892 బిలియన్ డాలర్ల మార్కుకు చేరుకున్నారు.  వీకెండ్ వసూళ్లను కూడా కలిపితే ఈ మొత్తం 2.7897 బిలియన్ డాలర్లను దాటిపోతుంది కాబట్టి ఇక అవ‌తార్‌ను, అవెంజర్స్ బీట్ చేసినట్టేనని మార్వెల్ సంస్థ ప్రెసిడెంట్ కెవిన్ ప్రకటించారు.  ఇక 2021 డిసెంబర్ 17న విడుదలకానున్న 'అవతార్ 2' చిత్రం 'అవెంజర్స్: ఎండ్ గేమ్'ను బీట్ చేస్తుందని ఆ చిత్ర టీమ్ చెబుతున్నారు.