పింక్‌బాల్ టెస్ట్.. అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు
సొంత గడ్డపై అక్షర్ పటేల్ అదరహో అన్పించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్... రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటాడు. మొత్తం 11 వికెట్లు తీసి... తన కెరీర్లో బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. అంతేకాదు సరికొత్త రికార్డు సృష్టించాడు. డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో 11 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 70 పరుగులిచ్చిన అక్షర్ పటేల్.. 11 వికెట్లు తీయడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో డే-నైట్ మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఇదే అద్భుతమైన రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు 10 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమీన్స్ పేరిట ఉంది. ఇక, మొతెరా వేదిక మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు.. డే-నైట్ టెస్టులో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో 5 వికెట్లు తీసిన ఎకైక బౌలర్ కూడా అరుదైన ఘనత సాధించారు. అక్షర్ మాయజాలం ముందు... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలువలేకపోయారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)