సాయి పల్లవి ట్రైన్ లో అంత పని చేసిందేంటి...పాపం చైతు.. 

సాయి పల్లవి ట్రైన్ లో అంత పని చేసిందేంటి...పాపం చైతు.. 

నాగ చైతన్య... సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతున్నది.  లవర్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.  ఏ పిల్లా అనే మ్యూజికల్ ప్రివ్యూ సాంగ్ రిలీజ్ చేశారు.  ఒకమ్మాయి అబ్బాయి మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుంది.  ఆ ప్రేమ ఎంత బలంగా ఉంటుంది.  బలమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య బంధం ఎంత బలంగా ఉంటుంది అనే విషయాలను ఈ సాంగ్ లో చూపించారు.  

సాంగ్ లో చూపించిన విధంగా సినిమా సినిమా ఉండబోతుందా లేదా అన్నది పక్కన పెడితే సాంగ్ మాత్రం చాలా ప్లజెంట్ గా ఉన్నది.  ఇక ఇందులో ట్రైన్ లో వెళ్లే సమయంలో సాయి పల్లవి పక్కనే కూర్చున్న చైతును ముద్దుపెట్టుకుంటుంది.  చుట్టూ చాలామంది ఉంటారు.  కానీ, చైతూను సాయి పల్లవి అలా ధైర్యం చేసి ముద్దుపెట్టుకోవడంతో చైతు షాక్ అవుతారు.  చాలా ఎమోషన్ గా ఫీల్ అవుతాడు.  వాటిని చైతు తన హావభావాల రూపంలో చాలా చక్కగా చూపించారు.  లవర్ డే రోజున రిలీజ్ చేసిన ఈ మ్యూజికల్ ప్రోమో పర్ఫెక్ట్ గా ఉందని చెప్పాలి.