అయోధ్య కేసు వాదనలు పూర్తి...తీర్పు రిజర్వ్

అయోధ్య కేసు వాదనలు పూర్తి...తీర్పు రిజర్వ్

అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మూడు రోజుల్లోపు రాతపూర్వకంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇరువర్గాలకు గడువు కూడా విధించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇవాల్టితో 40 రోజుల పాటు రోజవారీ విచారణను ధర్మాసనం చేపట్టింది. నవంబర్ 17న సీజేఐ పదవీ విరమణ చేయనుండటంతో ఆలోపే ఆయన తీర్పు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.