అయోధ్యలో హైఅలర్ట్

అయోధ్యలో హైఅలర్ట్

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేశాయి. ఈనేపథ్యంలో అయోధ్యకు వచ్చే రైళ్లు, బస్సులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదులు నేపాల్ మీదుగా ఉత్తరప్రదేశ్‌ లోకి ప్రవేశించే అవకాశమున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. అయోధ్యకు వచ్చే అన్ని బస్సులు, రైళ్లతో పాటు లాడ్జ్, హోటల్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేశామని అన్నారు. 2005, జూన్ 5న అయోధ్యలో జరిగిన ఉగ్రదాడి కేసు తుది తీర్పు జూన్ 18న రానుంది. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, మరికొందర్ని అరెస్ట్ చేశారు. మరోవైపు 18న శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే అయోధ్యకు రానున్నారు. ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన 18 ఎంపీలను కూడా తీసుకుని రానున్నారు. దీంతో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.