అయోగ్య తెలుగు ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

అయోగ్య తెలుగు ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

విశాల్ హీరోగా చేస్తున్న అయోగ్య సినిమా తమిళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్టైంది.  క్లైమాక్స్ అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా ప్లాన్ చేశారు. అక్కడ వర్కౌట్ అయ్యింది.  ఇప్పుడు ఇదే పేరుతో తెలుగులోనూ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.  అయోగ్య తెలుగులో వచ్చిన ఎన్టీఆర్ సినిమా టెంపర్ కు రీమేక్.  

టెంపర్ సూపర్ హిట్టైంది.  ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసి... అక్కడి నుంచి తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందా అన్నది అందరి ముందున్న ప్రశ్న.  విశాల్ సినిమాలకు తెలుగులో డిమాండ్ ఉండొచ్చు.  కానీ, ఒకసారి తెలుగులో రిలీజైన సినిమా మళ్ళీ రీమేక్ చేసి డబ్బింగ్ చేస్తే చూస్తారా అన్నది తెలియాలి.  ఇకపోతే, ఈ సినిమాలోని చివరి అరగంట సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చిత్రీకరించి రిలీజ్ చేస్తున్నారని సమాచారం.