తమిళ టెంపర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

తమిళ టెంపర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

టాలీవుడ్ లో సూపర్ హిట్టైన ఎన్టీఆర్ సినిమా టెంపర్ ను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విశాల్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  అయోగ్య పేరుతో అక్కడ చిత్రీకరిస్తున్నారు.  ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది.  తెలుగు టెంపర్ ను దాదాపుగా దించేశారు.  యాక్టింగ్ విషయంలో విశాల్ కు పేరు పెట్టాల్సిన అవసరం లేదు.  

కాగా, అయోగ్య సినిమా రిలీజ్ డేట్ ను కొద్దిసేపటి క్రితమే ఫిక్స్ చేశారు.  ఏప్రిల్ 19 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  అయోగ్య థియేట్రికల్ రైట్స్ ను స్క్రీన్ సీన్ సంస్థ సొంతం చేసుకుంది.  బాలీవుడ్ లో ఇప్పటికే టెంపర్ సినిమా సింబా పేరుతో రీమేక్ అయ్యి సూపర్ హిట్టైంది.  మరి తమిళంలో కూడా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుందాం.