లోకేష్ బైక్ ర్యాలీకి నో...మూడేళ్ళలో ఎన్నికలు అంటూ హెచ్చరిక !

లోకేష్ బైక్ ర్యాలీకి నో...మూడేళ్ళలో ఎన్నికలు అంటూ హెచ్చరిక !

తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా విశాఖ పర్యటనకి వెళ్ళిన నారా లోకేశ్ కి షాక్ తగిలింది. లోకేశ్ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. టూవీలర్ ర్యాలీ చేపట్టాలంటే బండి తోలేవారు అందరూ హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా నారా లోకేశ్ కాలినడకన ఎన్టీఆర్ ఆసుపత్రి వద్దకు బయలుదేరగా, టీడీపీ శ్రేణులు వాహనాలను నడిపించుకుంటూ ఆయన వెంట నడిచి వెళ్ళారు. అయితే బైక్‌ ర్యాలీకి అనుమతి లేదనడంతో అయ్యన్నపాత్రుడు స్పందించారు. హెల్మెట్లు లేకుంటే ర్యాలీకి అనుమతి లేదంటున్నారని, రాష్ట్రంలో ఎక్కడైనా ఈ పద్దతి ఉందా? అని ప్రశ్నించారు. మూడేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయని మళ్ళీ మా దగ్గరే మీరు పని చేయాలని పోలీసుల్ని హెచ్చరించారు. అలాగే తప్పు పోలీసులది కాదని పై స్థాయి నుండే వారి మీద ఒత్తిడి ఉందని పేర్కొన్నారు.