నియమాలు మరచి చేతులు కలిపిన కెప్టెన్లు...

నియమాలు మరచి చేతులు కలిపిన కెప్టెన్లు...

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఆడుతున్న తొలి టెస్టులో టాస్ సమయంలో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ అజార్ అలీ కరోనా నిబంధనను కొనసాగించడం పూర్తిగా మర్చిపోయాడు. అప్పుడు వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌ చేసిన పనినే అజార్ చేశాడు, గత నెలలో జరిగిన సౌతాంప్టన్ టెస్టులో టాస్ వద్ద ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ కు హోల్డర్‌ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ అప్పుడు స్టోక్స్‌ తనకు కరోనా నియమాలను గుర్తు చేసాడు. కానీ ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో అజార్ మరియు రూట్ ఇద్దరు మరచిపోవడంతో వారు చేతులు కలిపారు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఈ సంఘటన యొక్క రీప్లేలను టెలివిజన్‌లో ప్లే చేయడంతో రూట్ కరోనా నియమని గుర్తు చేసుకొని చేసిన పనికి నవ్వుకున్నాడు. అయితే కరోనా ముప్పు కారణంగా బంతి పై లాలాజలం ఉపయోగించడం మరియు ప్రతిపక్ష ఆటగాళ్లతో కరచాలనం చేయడం వంటివి ఐసీసీ నిషేధించింది. ఇక టాస్ గెలిచిన అజార్, ఈ తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు ఎన్నుకున్నాడు.