హైకమాండ్‌ డిసైడ్‌ చేస్తుంది: అజారుద్దీన్

హైకమాండ్‌ డిసైడ్‌ చేస్తుంది: అజారుద్దీన్

ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ తాను చేసిన అభివృద్ధి పనులను చెప్పేకంటే రాహుల్ గాంధీ కుటుంబంపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు. ఉద్యోగాల కల్పనపై గతంలో ఇచ్చిన హామీలపై నోరెత్తని మోడీ.. మళ్లీ ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. కేంద్రంలో యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు అవసరమైతే ఆ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని అజార్‌ స్పష్టం చేశారు.

ఇక.. అంబర్‌పేటలో మసీదును జీహెచ్‌ఎంసీ అక్రమంగా కూల్చివేసిందని అజారుద్దీన్‌ అన్నారు. పురాతన మసీదుకు కనీసం గౌరవం ఇవ్వలేదని, అవమానకరంగా కూల్చివేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి కారణమైన అధికారు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నష్టపరిహారం ఎవరికి చెల్లించారు..? ఏ ప్రాతిపదికన చెల్లించారు? అని ప్రశ్నించిన అజార్‌.. వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న మసీదుకు ఇతరులకు ఎలా పరిహారం చెల్లిస్తారని నిలదీశారు.