రాజ్‌భవన్‌కు చేరుకున్న యడ్యూరప్ప

రాజ్‌భవన్‌కు చేరుకున్న యడ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్ప ఈ రోజు ప్రమాణం చేయనున్న క్రమంలో ఆయన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గురువారం ఉదయం 9 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం  చేస్తారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో లైన్‌క్లియర్‌ అయినవిషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారోత్సవం కోసం రాజ్‌భవన్‌లో ఘనంగా  ఏర్పాట్లు చేశారు. మరోవైపు రాష్ట్రమంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు పెద్ద ఎత్తున రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. వారందరు పుష్పగుచ్చాలు, స్వీట్లతో అక్కడ సందడి చేస్తున్నారు. మరి కాసేపట్లో యడ్యూరప్ప ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణంకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రావడం లేదు. 104 స్థానాలు గెలిచిన బీజేపీకి గవర్నమెంట్ ను ఫామ్ చేయాల్సిందిగా.. ఆ రాష్ట్ర గవర్నర్ యడ్యూరప్పను ఆహ్వానించిన విషయం తెలిసిందే.