ఇప్పటికీ టాప్ లో అదే సినిమా ..!!

ఇప్పటికీ టాప్ లో అదే సినిమా ..!!

బాలీవుడ్ లో టాప్ సినిమా అనగానే అమీర్ ఖాన్ దంగల్ గుర్తుకు వస్తుంది.  ఈ సినిమా టాప్ లో ఉందని అనుకుంటాం. కానీ, బాలీవుడ్ లో టాప్ 10 లో ఉన్న సినిమాలకు సంబంధించిన లిస్ట్ రీసెంట్ గా రిలీజ్ చేశారు.  ఈ లిస్ట్ ప్రకారం టాప్ లో తెలుగు మూవీ బాహుబలి 2 నిలిచింది.  

బాహుబలి 2 సినిమాను హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేశారు.  ఈ మూవీకి ఊహించని విధంగా కలెక్షన్లు వచ్చాయి.  ఈ సినిమా ఇప్పటికీ టాప్ లోనే ఉన్నది.  దీని తరువాత స్థానంలో అమీర్ ఖాన్ దంగల్, సంజు, పీకే, టైగర్ జిందా హై, భజరంగి భాయ్ జాన్, పద్మావతి, సుల్తాన్, ధూమ్ 3 సినిమాలు ఉన్నాయి.  పదో స్థానంలో  మొన్నటి వరకు యూరి సినిమా ఉండేది.  దీన్ని కబీర్ సింగ్ బీట్ చేయడం విశేషం.  పదోస్థానంలో కబీర్ సింగ్ ఉండగా 11 స్థానంలో యూరి నిలవడం విశేషం.  మరి బాహుబలిని బీట్ చేసే సినిమా మళ్ళీ వస్తుందంటారా.. చూద్దాం.