మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్న బాహుబలి

మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్న బాహుబలి

బాహుబలి సీరీస్ లో రెండు సినిమాలు వచ్చాయి.  ఈ రెండు సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే.  ఏ బాలీవుడ్ స్టార్ కు సాధ్యం కానీ రికార్డులను బాహుబలి సొంతం చేసుకుంది.  ఇప్పుడు మరో రికార్డును బాహుబలి తన ఖాతాలో వేసుకోవడం విశేషం.  బాలీవుడ్ లో మోస్ట్ లైకెడ్ సినిమాలు ఏవి అనే దానిపై ఓ సంస్థ సర్వేను నిర్వహించింది.  వివిధ విషయాలను పరిగణలోకి తీసుకొని 100 పాయింట్లు  ఇవ్వాలి.  

ఈ సర్వేలో అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ సినిమా 90 పాయింట్లతో టాప్ లో ఉండగా, 85 పాయింట్లతో బాహుబలి 2 రెండో స్థానంలో నిలిచింది.  ఇక 83 పాయింట్లతో బాహుబలి మూడో స్థానంలో నిలవడం విశేషం.  ఒక డబ్బింగ్ సినిమా బాలీవుడ్ లో భారీ కలెక్షన్లు సాధించడం ఇదే మొదటిసారి.