బాహుబలి.. మూడు సీజన్లు, తొమ్మిది ఎపిసోడ్లు !

బాహుబలి.. మూడు సీజన్లు, తొమ్మిది ఎపిసోడ్లు !

ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ బాహుబలి - బిఫోర్ ది బిగినింగ్ పేరుతో త్వరలో ఒక వెబ్ సిరీస్ ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.  ఆర్కా మీడియా, రాజమౌళితో కలిసి ఈ వెబ్ సిరీస్ ను నిర్మించనుంది నెట్ ఫ్లిక్స్.  బాహుబలి - ది బిగినింగ్ కు ముందు శివగామి, మాహిష్మతి రాజ్య వైభవం, విస్తరణ వంటి ఆంశాలను ఈ సిరీస్ లో చూపనున్నారు. 

రచయిత నీలకంఠ రాసిన 'ది రైజ్ ఆఫ్ శివగామి'అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ ఉండనుంది.  మొత్తం మూడు సీజన్లలో ఒక్కో సీజన్ కు 3 ఎపిసోడ్స్ లెక్కన మొత్తం 9 ఎపిసోడ్స్ గా ఇది ప్రసారం కానుంది.  దేవ కట్ట, ప్రవీణ్ సత్తారు ఇద్దరూ కలిసి దీన్ని డైరెక్ట్ చేయనున్నారు.