బాహుబలికి అరుదైన గౌరవం.. 

బాహుబలికి అరుదైన గౌరవం.. 

బాహుబలి సీరీస్ లో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి.  రెండు సినిమాలు సృష్టించిన చరిత్ర అంతాఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా రెండువేల కోట్ల రూపాయలు పైగా వసూలు చేసింది.  ఈ సినిమాలు ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడ్డాయి.  ఇప్పుడు మొదటిసారిగా ఈ సినిమాను లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శిస్తున్నారు.  

ఈ ఆల్బర్ట్ హాల్ లో గత 148 సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన ఇంగ్లీష్ సినిమాలను మాత్రమే ప్రదర్శిస్తూ వస్తున్నారు.  కాగా, మొదటిసారిగా నాన్ ఇంగ్లీష్ సినిమాను రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించడం విశేషం.  అది బాహుబలి ది బిగినింగ్ కు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పాలి.  బాహుబలి యూనిట్ అంతా రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ఆ ప్రదర్శనకు హాజరైంది.