మరో సంచలన మూవీని రెడీ చేస్తున్న బాహుబలి రైటర్

మరో సంచలన మూవీని రెడీ చేస్తున్న బాహుబలి రైటర్

బాహుబలి, భజరంగి భాయ్ జాన్ ఈ రెండు సినిమాలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనాలు సృష్టించాయో చెప్పక్కర్లేదు.  ఈ రెండు సినిమాల ద్వారా రైటర్ విజయేంద్ర ప్రసాద్ మంచి పేరు తెచ్చుకున్నాడు.  జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో కంగనా చేసిన మణికర్ణికా సినిమాకు కథను అందించాడు.  

ప్రస్తుతం మరో సంచలన మూవీని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు విజయేంద్ర ప్రసాద్.  తమిళనాట అమ్మగా పేరు తెచ్చుకున్న పురచ్చితలైవి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు ఎల్ విజయ్ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.  ఇందులో కంగనా మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నది. విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.  జయలిత సాధారణ స్థాయి నుంచి అసాధారణ మహిళగా ఎలా ఎదిగింది అనే కోణంలో కథను రెడీ చేస్తున్నారట.  త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది ఈ సినిమా.