బాహుబలి రైటర్ నుంచి మరో బయోపిక్..!

బాహుబలి రైటర్ నుంచి మరో బయోపిక్..!

ప్రస్తుతం ఇండియాలో బయోపిక్ యుగం నడుస్తోంది.  తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభాలు ఉండటంతో.. దర్శక నిర్మాతలు బయోపిక్ లు తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు.  ప్రముఖుల బయోపిక్ ల రైటర్లు  కుస్తీపడుతున్నారు.  ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాహుబలి ఎలాంటి సక్సెస్ సాధించిందో చెప్పక్కర్లేదు.  బాహుబలి సీరీస్ కు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.  అటు బాలీవుడ్ లో సల్మాన్ భజరంగి భాయ్ జాన్ సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాదే రైటర్.  

రీసెంట్ గా బాలీవుడ్ లో వచ్చిన ఝాన్సీ లక్ష్మిభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మణికర్ణికా సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాదే రైటర్.  విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో హీరోయిన్ కంగనా.. మణికర్ణికకు దర్శకత్వం వహించింది.  రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బయోపిక్ ను తానే తీసుకుంటున్నట్టు ప్రకటించింది.  కంగనా బయోపిక్ కు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారని తెలుస్తోంది.  కంగనా బయోపిక్ కు సంబంధించిన విషయాలన్ని త్వరలోనే వెల్లడి కానున్నాయి.