బాహుబలి 2 ని బీట్ చేయలేకపోయాయి..!!

బాహుబలి 2 ని బీట్ చేయలేకపోయాయి..!!

టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా బాహుబలి 2.  బాహుబలి రెండు సీరీస్ లు కలిపి దాదాపుగా రూ.2000 కోట్లు వసూలు చేసింది.  ప్రపంచంలో ఇప్పటికి కొన్ని చోట్ల ఈ సినిమా ప్రదర్శితమౌతుంది.  రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు బాలీవుడ్లోను పెను సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.  

బాలీవుడ్లో మొదటి వారంలో బాహుబలి 2 రూ.128 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.  బాహుబలి తరువాత బాలీవుడ్లో అనేక చిత్రాలు రిలీజ్ అయ్యాయి.  కానీ, ఈ రికార్డ్ ను ఇప్పటివరకు ఏ సినిమా బీట్ చేయలేదు.  భారీ అంచనాల మధ్య రిలీజైన రేస్ 3, సంజు సినిమాలు బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేస్తాయని అనుకున్నా, చివరి వరకు వచ్చి ఆగిపోయాయి.  దీంతో, బాహుబలి 2 పేరిట నమోదైన రికార్ట్ ఇప్పటికి పదిలంగానే ఉంది.  మరి ఈ బాహుబలి 2 ను బీట్ చేయాలంటే.. మరలా రాజమౌళి రావాల్సిందేనేమో ..