రామ్ దేవ్ బాబా మళ్లీ అనేశాడు..!! 

రామ్ దేవ్ బాబా మళ్లీ అనేశాడు..!! 

వివాదాస్పద యోగ గురువు బాబా రామ్ దేవ్ ఎప్పుడు ఏది మాట్లాడినా అది ఒక సంచలనమే అవుతుంది.  తాజాగా బాబా రామ్ దేవ్ రామాలయం, ముస్లింల విషయంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  శ్రీరాముడు కేవలం హిందువులకే కాదు, ముస్లింలకు కూడా ఆరాధ్య దేవుడు అని చెప్పారు.  ఈ మాట ఇపుడు సంచలనం అయ్యింది.  రాముడు హిందువుల దేవుడే అని, ముస్లింలు కాదని కొందరు అంటున్నారు.  

మన దేశంలో  ఎక్కువ శాతం ముస్లింలు మత మార్పిడికి గురైనవారేనని, ముస్లింలూ శ్రీరాముడిని గౌరవిస్తారని బాబా రాందేవ్ చెప్పుకొచ్చారు.  ఈ మాటలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.  అయోధ్య వివాదంపై వచ్చిన తీర్పు తరువాత అందరు సంయమనం పాటించాలని ప్రభుత్వం హెచ్కారికలు జారీ చేసిన నేపథ్యంలో బాబా రామ్ దేవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.