భారత కెప్టెన్ రికార్డును సమం చేసిన పాక్ కెప్టెన్...

భారత కెప్టెన్ రికార్డును సమం చేసిన పాక్ కెప్టెన్...

పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన రికార్డును సమం చేసాడు. అయితే క్రికెట్ ప్రపంచంలో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు బాబర్ ను కోహ్లీతో పోలుస్తుంటారు . కానీ అలా విరాట్ తో పోల్చడం నాకు ఇష్టం లేదు అని బాబర్ చాలాసార్లు చెప్పాడు. అయితే ప్రస్తుతం పాక్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. టెస్ట్ సిరీస్ ను ముగించుకున్నఈ రెండు జట్లు ప్రస్తుతం టీ 20 సిరీస్ లో తలపడుతున్నాయి. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన రెండో మ్యాచ్ లో పాక్ కెప్టెన్ బాబర్ 44 బంతుల్లో 56 పరుగులు చేసాడు. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్ లో వేగంగా 1500 పరుగులు చేసిన జాబితాలో ముందున్న కోహ్లీ, అలాగే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌లతో సమానంగా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో బాబర్ తన 14 వ టీ 20 హాఫ్ సెంచరీని సాధించాడు. ఈ క్రమంలోనే కేవలం 39 ఇన్నింగ్స్ లో 1500 పరుగులు చేసి కోహ్లీ సరసన నిలిచాడు. అయితే టీ 20 ఐసీసీ ర్యాంకింగ్స్ లో బాబర్ (879)  పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా విరాట్ (673) పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు.