నన్ను భారత ఆటగాడితో కాదు పాక్ ఆటగాడితో పోల్చండి...

నన్ను భారత ఆటగాడితో కాదు పాక్ ఆటగాడితో పోల్చండి...

పాకిస్తాన్ బ్యాటింగ్ స్టార్, పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్ తనను విరాట్ కోహ్లీతో పోల్చడం పై స్పందించాడు, భారత కెప్టెన్‌తో పోల్చడం తనకు ఇష్టం లేదని అన్నారు. అలాగే పాకిస్తాన్ బ్యాటింగ్ దిగ్గజాలు అయిన జావేద్ మియాందాద్, మహ్మద్ యూసుఫ్ వంటి వ్యక్తులతో ప్రజలు పోల్చినట్లయితే తాను సంతోషిస్తానని వోర్సెస్టర్షైర్ నుండి పాకిస్తాన్ మీడియాతో మాట్లాడుతూ బాబర్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, ఆట యొక్క అన్ని ఫార్మాట్లలో బాబర్ యొక్క ప్రదర్శన చూసి క్రికెట్ అభిమానులు మరియు నిపుణులు అతన్ని కోహ్లీతో పోల్చుతున్నారు. బాబర్ నెంబర్ 1 ర్యాంక్ టీ 20 ఐ బాట్స్మెన్ కాగా, వన్డే క్రికెట్‌లో కోహ్లీ నంబర్ 1 గా ఉన్నాడు. అయితే బాబర్ సగటు వన్డే, టీ 20 లలో 50 కి పైగా మరియు టెస్టుల్లో 45 కంటే ఎక్కువ గా ఉంది. కానీ కోహ్లీ సగటు మూడు ఫార్మాట్లలో 50కి  పైగా ఉంది. ఆగస్టు లో జరగాల్సిన టెస్ట్, టీ 20 సిరీస్ కోసం ఇంగ్లాడ్ వెళ్లిన పాకిస్థాన్ జట్టులో బాబర్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పటికే అక్కడికి చేరుకున్న పాక్ జట్టు 14 రోజుల నిర్బంధం లో ఉంది.