సీఈసీతో బాబు భేటీ

సీఈసీతో బాబు భేటీ

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. చంద్రగిరిలో రీపోలింగ్‌పై భగ్గుమంటున్న బాబు.. ఆ విషయాన్ని సీఈసీ వద్ద ప్రస్తావించారు. వైసీపీ ఫిర్యాదు చేసిన వెంటనే రీపోలింగ్‌కు ఆదేశించడంపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ లేవనెత్తిన అంశాలపై ఈసీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఈమేరకు పది పేజీల విజ్ఞాపన పత్రాన్ని బాబు అందజేశారు.