దేవెగౌడతో బాబు అర్ధరాత్రి సుదీర్ఘ చర్చలు

దేవెగౌడతో బాబు అర్ధరాత్రి సుదీర్ఘ చర్చలు

మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.  బెంగళూరులోని పద్మనాభనగరలోని దేవెగౌడ నివాసానికి బాబు వెళ్లారు. ఢిల్లీలో ఎన్డీయేతర పార్టీల నేతలతో భేటీ అనంతరం అక్కడి నుంచి నేరుగా బెంగళూరు వెళ్లారు. ఫలితాల అనంతర పరిణామాలపైనా దేవెగౌడతో సమాలోచనలు జరిపారు. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో చంద్రబాబు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అందులో భాగంగానే అనేకమంది నేతలతో భేటీ అవుతున్నారు.