హరికృష్ణ ప్రథమ వర్థంతి...హాజరయిన బాబు

హరికృష్ణ ప్రథమ వర్థంతి...హాజరయిన బాబు

దివంగత నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఆయనకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నివాళులర్పించారు. తిథి ప్రకారం ఈరోజు హరికృష్ణ వర్థంతిని నిర్వహించాలని కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ఉదయం హరికృష్ణ నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ లను పరామర్శించారు. కాసేపు ఈ సందర్భంగా బాబు జూనియర్‌ ఎన్టీఆర్‌ తో కొద్ది సేపు మాట్లాడారు. అనంతరం హరికృష్ణ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. గతేడాది ఆగస్టు 29న నెల్లూరులో ఓ వివాహా కార్యక్రమానికి వెళుతుండగా నల్గొండ జిల్లా అద్దంకి-నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై హరిృష్ణ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. స్వయంగా కారు నడుపుతున్న ఆయన సీటుబెల్టు పెట్టుకోకపోవడంతో తీవ్రగాయాలు కావడంతో ఆయనను స్థానికులు నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరికృష్ణ ప్రాణాలు కోల్పోయారు.