భయానకం: ఇలాంటి దృశ్యం ఎప్పుడూ చూసుండరు...!!

భయానకం: ఇలాంటి దృశ్యం ఎప్పుడూ చూసుండరు...!!

ఆఫ్రికాలో అడవులు ఎక్కువగా ఉంటాయి.  అక్కడ ఎక్కువగా ఏనుగులు, సింహాలు ఎక్కువ.  వీటితో పాటుగా తోడేళ్ళు, హైనాలు కూడా ఎక్కువగా ఉంటాయి.  అక్కడి నేల ఎక్కువగా పోటీగా ఉంటుంది.  కొన్ని చోట్ల మాత్రం నీరు ఇంకిపోయి బురదగా ఉంటుంది.  ఇలాంటి బురదలో ఓ గున్న ఏనుగు దిగబడిపోయింది.  దానిని బయటకు తీసేందుకు తల్లి ఏనుగు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది.  ఎక్కడి వచ్చాయో తెలియదుగాని హైనాగా గుంపు అక్కడికి వచ్చింది.  

ప్రమాదాన్ని పసిగట్టిన తల్లి ఏనుగు పిల్ల ఏనుగుపై బురదను జల్లింది.  అయినా ఫలితం లేదు.  తల్లి ఏనుగును తరిమేసి హైనాల గుంపు గున్న ఏనుగుపై దాడి చేశాయి.  బతికుండగానే దాన్ని పీక్కు తిన్నాయి.  ఓ వైల్డ్ ఫోటోగ్రాఫర్ దానికి సంబంధించిన ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  హృదయ విదారకమైన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.