ఆ పాప హెలికాప్టర్ షాట్ కు ఫిదా అయిన భారత మాజీలు... 

ఆ పాప హెలికాప్టర్ షాట్ కు ఫిదా అయిన భారత మాజీలు... 

భారత మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని హెలికాప్టర్ షాట్ కు ప్రపంచమంత ఫిదా అయిపోయింది. అంతర్జాతీ, దేశవాళీ, గల్లీ క్రికెట్ లోను ఈ షాట్ ను అనుకరించేందుకు క్రికెటర్లు అందరూ ప్రయత్నిస్తుంటారు. ఇక మహిళా ఈ షాట్ బాదితే ఇంకా ప్రత్యేకంగా ఫీల్ అవుతుంటారు. అయితే తాజాగా ఓ ఏడేళ్ల పాప హెలికాప్టర్ షాట్లు కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. అందులో ఆమె ప్రతి బంతిని హెలికాప్టర్ షాట్ గా మలిచేందుకు ప్రయత్నించింది. దాంతో భారత మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్ ఆమెకు అభిమానులుగా మారిపోయారు.  ఆకాశ్ చోప్రా అయితే ఆ వీడియోకు హిందీలో తన కామెంట్రీ జోడించాడు. మీరు కూడా ఆ పాప హెలికాప్టర్ షాట్ చూడాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.