ఎల్లుండి నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. రేపు కీలక భేటీ  

ఎల్లుండి నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. రేపు కీలక భేటీ  

ఆంధ్రప్రదేశ్‌ బీఏసీ సమావేశం రేపు ఉదయం పదిన్నర గంటలకు జరగనుంది. ఎల్లుండి ఉదయం 9 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ,  చర్చించాల్సిన అంశాలపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. గతానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందుగానే బీఏసీ సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ నెల 12న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 

వ్యవసాయ శాఖ బడ్జెట్‌ను ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రతా తదితర విషయాలపై సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, ఇతర శాఖల కార్యదర్శులతో స్పీకర్‌ చర్చించారు.