ఈ క్వీన్ కు బాచిలర్ లైఫ్ బాగుందట..!!

ఈ క్వీన్ కు బాచిలర్ లైఫ్ బాగుందట..!!

క్వీన్ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు కంగనా.  కంగనా వయసు ఇప్పుడు 31దాటింది.  ఈ వయసులో ఉన్న హీరోయిన్లు చాలా మంది ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు.  మరికొందరు పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు.  కంగనా మాత్రం పెళ్లి విషయంలో సైలెంట్ గా ఉంటున్నది.  తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని.. ఇప్పటికి ఈ బ్యాచులర్ లైఫ్ హ్యాపీగా ఉందని, తన సోదరి పిల్లలతో ఆడుకుంటూ హాయిగా ఉన్నానని అంటున్నది.  

కంగనకు 23 వ సంవత్సరంలోనే వివాహం చేయాలని అనుకున్నారట తల్లిదండ్రులు.  కంగన మాత్రం అందుకు ససేమిరా అని చెప్పిందట.  మరలా ఇంట్లో ఇప్పటివరకు ఆ ప్రస్తావన తీసుకురాలేదట.  బ్యాచులర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నానని.. ఇంతకన్నా వేరే లైఫ్ అక్కర్లేదని అంటోంది మణికర్ణిక స్టార్.