పాక్‌లో ఉగ్రదాడులు.. 9 మంది మృతి

పాక్‌లో ఉగ్రదాడులు.. 9 మంది మృతి

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు చెలరేగిపోయారు. డేరాఇస్మాయిల్‌ఖాన్ జిల్లాలో రెండు చోట్ల దాడులకు పాల్పడ్డారు. నాలుగు వాహనాల్లో వచ్చిన దుండుగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మరో చోట సూసైడ్‌ బాంబర్‌ తనను తాను పేల్చుకుని కలకలం సృష్టించింది. గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనల్లో ఆరుగురు పోలీసులతో సహా 9 మంది మృతి చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడులు తమ పనేనని తెహ్రీక్‌-ఈ-తాలిబన్‌ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.